ఏ దేశ సంస్కృతైన దాని పురోగతికాని, అధోగతి కాని చెందాలంటె దానిలో స్త్రీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందులోను భారతదేశపు సంస్కృతి, నడవళిక ప్రాముఖ్యత దేశము నలుమూలాల వ్యాపించడంలో మహళలకు ఒక్క ప్రత్యేక స్థానము కలదు. వేదాలలో, పూరణాలలో అగుపడు సీత,సావిత్రి, ద్రౌపది, అనసూయ,అహల్య మొదలగువారు వారి ఆచార నియమాలలో,నడవళికతో, కట్టు-బొట్టు తో మన దేశ సంస్కృతి ఔన్యత్యానికి ప్రతిబింబాలుగా ఆచంద్రార్కము నిలిచారు.
కావున వారి అడుగు జాడలలో నడచి ఈ దేశ సంస్కృతిని నిలబెట్టడంలో మన వంతు సేవను ప్రతి స్త్రీ నిర్వర్తించాలి అనే ఒక్క చిన్ని ఆశే- ఈ లేఖనము.
ఈ లేఖనములో మొదటగా స్త్రీ ధర్మాలు, వారి కట్టు-బొట్టు
1. మన సనాతన సంప్రాదాయల ప్రకారము స్త్రీ ముఖ్యమైన వ్రతము అనగా- పాతివ్రత్యము.
“స్త్రీణాం తు పతిదేవానాం తచ్ఛ్రుషానుకూలతా” ఇక్కడ పతి సేవ అనగా పతి అంతర్గతుడై ఆ మహావిష్ణువే కలడాని భావించి సపర్యాలు చేయాలని ద్వైత మత స్థాపకులైన “శ్రీ మధ్వాచార్యులు” చెప్పారు. ఈ విధాముగా పతి అంతర్గత భగవంతుని సేవ చేసినచో భర్తకు సేవకురాలు అనే చిన్నచూపు మన స్త్రీలకు కలుగదు. ఈ అంతర్గత చింతనము ద్వారా ఇటు పుట్టినింటి కులము మరియు మెట్టినింటి కుల అభివృధి చేసిన కీర్తి దక్కుతుందని శ్రీ మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకంలో పేర్కోన్నారు.
“కన్యోదితా బత కులద్వయతారిణీతి|
జాయా సఖేతి వచనం శ్రుతిగం శ్రుతశ్చ” ||
అంతే కాకుండ శ్రుతుల(వేదాల) ప్రకారము భార్య అంటే భర్తకు మంచి స్నేహితురాలు. కావున భర్త, భార్యకు స్నేహితుని స్థానాన్ని కల్పించాలని శాస్త్రాలలో చెప్పబడినది.
శ్రీమద్భాగవతంలో కశ్యప మహర్షి దితి దేవిని ఉద్దేశించి స్త్రీల గురించి చాలా గొప్పగా ప్రశంసించారు. స్త్రీ పతి అంతర్గత సేవ చేస్తూ భర్త యొక్క ప్రేమనురాగాలకు పాత్రురాలు కావాలి. దేశాని మంచి ప్రజలను ఇవ్వడంలో స్త్రీ జీవనం సార్థకము అవుతుందని మహాభారతంలో చెప్పబడినది.
వేదాలలో చెప్పినట్టుగా “మూర్ధానం పత్యురారోహ ప్రజయా చ విరాట్ భవ”
1. భార్య, భర్త యొక్క బంధువులను ఆదరించాలి.
2. ఇంటి కసువు ఊడవడమె(House-brooming) కలిపురుషుని విసర్జనము అనుకోవాలి.
3 గోమయముతో(cow-dung) ఇంటిని శుద్ధి చేయడమె లక్ష్మీదేవి ఆవాహనము అనుకోవాలి.
4. ఇంటి ముందు కల్లప్పి వేసి ముగ్గు పెట్టడమె ఆ కృష్ణుని మందిరము అనుకోవాలి.
5. దేవుడు ఇచ్చినదానిలో తృప్తి చెందాలి. అతి ఆశతో మెలగకూడదు.
6. దేవ-పితృ కార్యములను కార్యదక్షతతో నిర్వర్తించాలి.
7. ప్రతి స్త్రీ సదాచారము-సద్వ్రతము-సత్కర్ముములను నిర్వహించాడము ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైనది “జ్ఞానార్జన” అని శ్రీ మధ్వాచార్యులు తమ్మ గ్రంథములలో పలు చోట్ల పేర్కోన్నారు.
స్త్రీలకు జ్ఞానార్జన :ప్రపంచములోని ప్రజలను సంతోష పెట్టు సాధన మార్గము ఏది? దుఃఖ పరిహారమునకు మార్గము ఏది? స్త్రీ, శూద్రాదులకు మోక్షమార్గమును చూపుమని బ్రహ్మాది దేవతాలు ఆ విష్ణు రూపమైన్ శ్రీ వేదవ్యాసులను ప్రార్థించాగ, వేదవ్యాసులు కరుణతో “శ్రీ మహాభారతము” ను సమాజనికి కానుకాగ ఇచ్చినారు. ఆ మహాభారతము నందున శ్రేష్ఠమనవిగా పేర్కోను “శ్రీ విష్ణు సహస్రనామము”, “భగవద్గీతా” తప్పకుండా ప్రతి మనిషి నిత్యము పఠిచవలెనని శ్రీ మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకం ద్వారా తెలుపడమైనది.
“భారతం సర్వశాస్త్రేషు భారతే గీతికా వరా|
విష్ణోః సహస్రనామాపి జ్ఞేయం పాఠ్యం చ తద్వయమ్ || (మహాకౌర్మ)
శ్రీమద్భావతములోను ఈ విషయమును సమర్థిస్తుంది-
స్త్రీశూద్ర ద్విజ బంధూనాం త్రయీ న శ్రుతిగోచరా|
కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ పదం ఏవం భవేదిహ|
ఇతిభారతమాఖ్యానం కృపయా మునినా కృతమ్ ||
ఇంతేకాకుండా శ్రి మాహాభారత తాత్పర్యనిర్ణయంలోని మొదటి భాగములో శ్రీ మధ్వాచార్యులు మోక్ష సాధనకై అవశ్యముగా జరుపు చింతనము గురించి తెలిపారు.
1. విష్ణుర్హి దాతా మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయా|
మోక్షో జ్ఞానం చ క్రమశో ముక్తిగో భోగ ఏవచ |
ఉత్తరేషాం ప్రసాదేన నీచానాం నాన్యథా భవేత్ |
భావం: మోక్ష దాత విష్ణువు ఒక్కడే. వాయుదేవుడు ఆయన అజ్ఞామేరకు మోక్ష దారి చూపుతాడు. జ్ఞానమైన, ఆనందమైన ఉత్తముల అనుగ్రహముతోనె లభించగలవు. వారి అనుగ్రహము తప్ప వేరే మార్గము లేదు.
2. తారతమ్య జ్ఞానముతోనే మొక్ష ప్రాప్తి
3. పంచభేదముల గురించి జ్ఞానమ్ఉ ఉండవలెను. ౧.జీవ-దేవుడు, ౨. జడ-దేవుడు, ౩. జీవము-జడము, ౪. జడ- జడ , ౫. జీవ- జీవము లందు భేధములను సరిగా తెలుసుకొనవలెను.
4. హరి(విష్ణువు యొక్క) అవతార రూపముల జ్ఞానము ఉండవలెను. అనగా హరి అవతార రూపములుఏవి అని మరియు హరి అవతారములు కాని రూపములు ఏవి అను జ్ఞానమ ఉండవలెను.
5. హరియే సర్వోత్తముడు, వాయు జీవోత్తముడు అను నమ్మువారికి మోక్షము లభించును.
6. అన్ని వేద శాస్త్రము లు శ్రీ విష్ణుపరము అని తెలుసుకోవాలి.
7. అన్నింటికన్నా ముఖ్యమైనది భక్తి, విశ్వాసము తో మోక్షము లభించును.
ఈ విధముగా శ్రీ మధ్వాచార్యులు మహాభారత తాత్పర్య నిర్ణయము నందు ఈ ఏడు మార్గములు పాటించువారి మోక్షము లభించునాని పేర్కోన్నారు.
Photo Source : http://www.harekrsna.com/
Thanks for posting this, And could help us if this is in English 🙂
ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి శిష్యునికి ఉండాల్సిన అర్హతలేవి
ధన్యవాదాలు రఘునందన్ గారు. ఇది ప్రస్తుతం అత్యావశ్యకమైన ధర్మం.